వాడ సుగర్ ఫ్యాక్టరీ చెరుకు సరఫరా చేసినటువంటి రైతులకు బకాయిలు చెల్లించాలి..
08/August/2026 20:17
Share:
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరుకు సరఫరా చేసినటువంటి రైతులకు బకాయిలు చెల్లించాలని ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేసిన కార్మికులకు జీత బకాయిలు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ చోడవరం నియోజకవర్గంలో తాసిల్దార్ కార్యాలయం పక్కన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించా ము చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసినటువంటి రైతులు 24 వేల మంది రెండు లక్షల 25 వేల టన్నులు ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేశారు 2024 2025 సంవత్సరాల్లో ఈ చెరుకుని సరఫరా చేశారు అప్పటినుంచి ఇప్పటివరకు రైతులకు కార్మికులకు ఒక రూపాయి కూడా చెల్లించలేదు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పంచదార ప్రభుత్వం అమ్మకం చేసేసింది ఆ అమ్మిన డబ్బుని ప్రభుత్వం వద్ద ఉంచుకుంది కానీ రైతులకు కార్మికులకు బకాయి చెల్లించలేదు రైతులకు కార్మికులకు బకాయి చెల్లించకుండానే ఫ్యాక్టరీని మూసేశారు రైతులందరూ కొంతమంది బ్యాంకుల్లోని రుణాలు తీసుకున్నారు కొంతమంది బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు కొంతమంది చుట్టాలు బంధువుల దగ్గర వడ్డీ డబ్బులు అప్పు తీసుకున్నారు ప్రభుత్వం చెరుకు బకాయిలు చెల్లిస్తుంది కదా ఆ డబ్బుతో రుణాలు తీర్చుకోవచ్చని ఎంతో ఆనందపడ్డారు రైతులందరూ నేడు కంటతడి పెడుతున్నారు రైతులందరూ స్థానిక రాజకీయ నాయకులు మౌనంగా ఉండి పోయారు ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యాపార వర్గాలు రైతులు కార్మికులు, విద్యార్థులు అందరూ ఏకమై రైతులు పట్ల నిలబడిటైతే రైతులందరికీ ప్రభుత్వం చెల్లించవలసిన డబ్బులు చెల్లిస్తుంది రైతులు మనం కాపాడితే రైతు దేశాన్ని కాపాడుతాడు మనందరం రైతు పక్షాన నిలబడడం రైతు బకాయిలు చెల్లించే వరకు పోరాడుదాం ఈ నిరాహార దీక్ష ఆమ్ ఆద్మీ పార్టీ రైతులకు కార్మికులకు ప్రభుత్వం చెల్లించవలసిన చెల్లింపులు పూర్తయ్యేంతవరకు ఈ దీక్ష కొనసాగుతుంది పోరాడుతాం