నేరుగా సిబ్బంది సమస్యలు ఆలకించిన అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు
అనకాపల్లి, ఆగస్టు 7:
పోలీస్ సిబ్బంది సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వినూత్న వేదిక ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు స్వయంగా ఫోన్ లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలను ఆలకించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న సిబ్బంది 93469 12011 నంబర్ ద్వారా అదనపు ఎస్పీ గారితో నేరుగా మాట్లాడారు.
ప్రధాన సమస్యలు: బదిలీలు, పోస్టింగ్స్, సెలవులు, సర్వీస్ మరియు కుటుంబ ఆరోగ్య సమస్యలను అధికారులు దృష్టికి తెచ్చారు.
వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు. ప్రతి సమస్యను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. వచ్చే ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.