అచ్చుతాపురం, ఆగస్టు 6:
NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు నేపథ్యంలో పూడిమడక భూ నిర్వాసిత రైతులు ఈ రోజు అచ్చుతాపురం వన్ స్టాప్ సర్వీస్ సెంటర్‌లోని APiiC కార్యాలయం వద్ద డిప్యూటీ జోనల్ మేనేజర్ కె. సూర్యనారాయణతో సమావేశమయ్యారు.2004లో SEZ భూ సేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత రైతు కుటుంబానికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే అర్హులైన కుటుంబాలకు వెంటనే R-కార్డులు అందజేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు.రైతులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి, రాతపూర్వకంగా మరియు మౌఖికంగా ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో నిర్వాసిత రైతు కుటుంబాలన్నింటినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రైతు నాయకులు చోడిపల్లి అప్పారావు, ఉమ్మిడి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, మైలపల్లి మసీను రావు, మాతా గంటాలరావు పాల్గొన్నారు.