ఎల్ నినో ప్రభావంపై రైతులకు సూచనలు ..!

ఎల్ నినో ప్రభావంపై రైతులకు సూచనలు ..!

06/August/2026 06:14    Share:   

యలమంచిలి,పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు ఆధ్వర్యంలో విద్యాభ్యసించిన శ్రీకాకుళం అగ్రికల్చర్ కాలేజ్ విద్యార్థులతో పాటు శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు పర్యటన రామారాయుడుపాలెం, జంపపాలెం, సోమలింగపాలెం ,తురంగలపాలెం గ్రామాలలో  చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త ఆళ్ల అప్పలస్వామి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వరి నేరుగా విత్తే పద్ధతిలో వడలిపోయినట్లయితే ఐదు గ్రాములు పొటాషియంనైట్రేట్ ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే నీటి ఎద్దడిని తట్టుకోవచ్చని అలాగే భూములు తగినంత తేమ ఉన్నట్లయితే వరిలో గడ్డి మందులు వాడుకున్నట్లయితే కొంతమేర కూలీల ఖర్చులు నుంచి అధిగమించవచ్చని అలాగే సీనియర్ శాస్త్రవేత్త భవాని  మాట్లాడుతూ వరి నారుమడులలో ఎక్కువగా పాము పుడ తెగులు మరియు చిన్న పాటి తెల్ల దోమలు కనిపించడం వలన తగినంత తేమ పెట్టడానికి అవకాశం ఉన్నట్లయితే కార్బోఫ్యూరానే 3g గులుకులు ఒక సెంటు నారుమడికి 160 గ్రాములు చొప్పున వేసుకుంటు అలాగే పాము పొడ తెగులు ఉన్నట్లు అయితే హెక్సా కొనజోల్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి స్ప్రే చేసిన తర్వాత పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే తెగులు మరియు పురుగులు బెడద నుంచి తప్పించుకోవచ్చు అని తెలియజేశారు, సీనియర్ శాస్త్రవేత్త రవికుమార్  మాట్లాడుతూ రైతులు RGL 2537 వరి రకం కాకుండా MTU 1224 ,MTU 1262 BPT 5204 రకాల సాగు చేసుకున్నట్లయితే విత్తనం మార్పిడి వలన మూడు నుంచి నాలుగు బ్యాగులు అదనంగా దిగుబడి వస్తుందని అలాగే బెట్ట పరిస్థితుల్లో వరి విత్తుకోవడం ఆలస్యం జరిగితే రాగి పంట మరియు మొక్కజొన్న పంటల వైపు రైతులు వేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ వరి పంటల బీమా తప్పనిసరిగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయించుకోవాలని రైతు సోదరులకు మరొకసారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు తోట గణేష్ ఎల్లపు నాయుడు, ఈశ్వరరావు వ్యవసాయ సహాయకులు అరుణ, దీపిక రైతులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter