ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు ఇన్సూరెన్స్ చేసుకోవటానికి 11 రోజులు మాత్రమే ఉందని మండల వ్యవసాయ అధికారి మరియు అభివృద్ధి అధికారి ఈ రోజు తెలియజేశారు ,ఈరోజు మీసేవ లో కామన్ సర్వీస్ సెంటర్ వద్ద రామకృష్ణ ఆధ్వర్యంలో రైతుల ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు మండలంలోని 8474 మంది రైతులు బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మరియు లోన్ తీసుకోలేని రైతులు సిఎస్సి సెంట్రల్ ద్వారా నమోదు చేయించుకోవాలని తెలియజేశారు, వీటికి ఆధార్ తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ 1బి మరియు బ్యాంక్ పాస్ పుస్తకం తప్పనిసరి అంటూ ఆధార్ నెంబర్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దీపికతో పాటు డిప్యూటీ ఎంపీడీవో అనంత నాగ్ రైతులు పాల్గొన్నారు