బ్రాండ్‌ఎక్స్ బస్సులో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ కార్మికులు
04/August/2026 17:21
Share:
అనకాపల్లి జిల్లా, (క్రైమ్ అనాలసిస్ ప్రతినిధి): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం నుంచి అచ్యుతాపురంలోని బ్రాండ్‌ఎక్స్ కంపెనీకి ఏ-షిఫ్ట్ కార్మికులను తీసుకెళ్తున్న బస్సులో మంగళవారం పీఎన్‌ఆర్‌పేట గ్రామ సమీపంలో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయగా, కార్మికులంతా అప్రమత్తంగా క్షణాల్లో బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న ఎలమంచిలి అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని ఎలమంచిలి అగ్నిమాపక అధికారి డి. రాంబాబు తెలిపారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.