యలమంచిలి,రాంబిల్లి | దిమిలి గ్రామంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన- రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.అనకాపల్లి జిల్లావనరుల కేంద్రం,ఏ.డి.ఏ.శ్రీధర్ ప్రస్తుత ఎల్ ని నో పరిస్థితుల దృష్ట్యా వరి సాగు చేస్తున్న రైతులందరూ ఈపథకంలో ఎకరానికి రూ.84/- ప్రీమియం చెల్లించి ఆగష్టు 15 వ తేదీ లోగా భీమా చేసుకోవాలని సూచించారు. రైతులు ఆధార్ కార్డు,భూమి పాస్ బుక్ -1బి,బ్యాంకు ఖాతా పుస్తకం,ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ తో మీ సేవ కేంద్రాల లో గాని pmfby.gov.in /క్రాప్ ఇన్సూరెన్స్ ఆప్ ద్వారా గాని ప్రీమియం చెల్లించవచ్చునని తెలియజేశారు.అనంతరం జంగాలపాలెం గ్రామంలో సురేష్ మీ సేవ కేంద్రంలో భీమా చేసుకున్న రైతులకు పంట భీమా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సి.సుమంత ఏఈఓ దేవుడు,రైతులు పాల్గొన్నారు.