కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ

30/July/2026 19:11    Share:   

అనకాపల్లి కలెక్టరేట్ ముట్టడించిన వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు
సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఆందోళన – డీఆర్వోకు వినతిపత్రం
అనకాపల్లి: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పారిశ్రామిక కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌ఏ), వైద్య ఆరోగ్య శాఖ, గ్రామపంచాయతీ, మున్సిపల్, విద్యుత్, వ్యవసాయ మార్కెట్, ఫార్మా, ఎన్టీపీసీ, ఆర్టీసీ తదితర రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు మాట్లాడుతూ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 15 ఏళ్లుగా వేతనాల సవరణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏళ్లుగా వేతనాలు పెరగకపోవడంతో పాటు పలుచోట్ల నెలల తరబడి జీతాలు బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్, ఫార్మా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇతర రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బకాయి వేతనాలు విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్మికుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొం
Breaking News

Subscribe our Newsletter