గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు
29/July/2026 19:42
Share:
అనకాపల్లి: గురుపౌర్ణమి సందర్భంగా 84వ వార్డు గొల్లవీధిలోని శ్రీకృష్ణ దేవాలయంలో బోడి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు బోడి వెంకట్రావు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారని తెలిపారు. మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను, ఉపాధ్యాయులను ఈ పవిత్ర రోజున ప్రత్యేకంగా స్మరించి పూజించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. వేదవ్యాస మహర్షి జన్మదినంగా కూడా ఈ రోజును భావిస్తారని, అలాగే పరమశివుడు సప్త ఋషులకు యోగ జ్ఞానాన్ని బోధించిన పవిత్ర దినంగా గురుపౌర్ణమికి విశిష్ట స్థానం ఉందని వివరించారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు చేతుల మీదుగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్, బొబ్బిలి గోవిందరాజు, నమ్మి రామారావు, నమ్మి దేవుడమ్మ, బోడి ఉమా తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ