లంకా దినకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి..

లంకా దినకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి..

28/July/2026 20:43    Share:   

ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్  లంకా దినకర్ ను, మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు ...

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఏలూరు, జూలై 28: జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశమందిరంలో మంగళవారం ఒక్కరోజు జిల్లా పర్యటనకు వచ్చిన ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్  లంకా దినకర్ ను, మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కైకలూరు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి. సంధీఫ్ రెడ్డి లు పూలమొక్కలు, పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, వివిధ శాఖలు జిల్లా అధికారులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter