రాజకీయాల్లోకి ఎంట్రీపై సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాల్లోకి ఎంట్రీపై సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు!

26/July/2026 10:04    Share:   

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సౌరవ్ దాస్, భవిష్యత్తులో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారే అవకాశంపై స్పందిస్తూ, "భారతదేశంలో దేనికైనా ఎప్పుడూ 'లేదు' అని చెప్పలేం" అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. దేశంలో ఇప్పటికే 75-80 వేల రాజకీయ పార్టీలు ఉన్నాయని, కానీ అవేవీ యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. తమ ప్రస్తుత ఏకైక అజెండా ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి (Grassroots) తీసుకెళ్లడమేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలో ఒక బలమైన సామాజిక ఉద్యమ వ్యవస్థను నిర్మించడమే తమ ప్రాధాన్యతని, తద్వారా అధికారంలో ఏ పార్టీ ఉన్నా యువత సమస్యలపై పనిచేసేలా ఒత్తిడి తెస్తామని సౌరవ్ దాస్ వెల్లడించారు
Breaking News

Subscribe our Newsletter