ఏటికొప్పాక గ్రామంలో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం విజయవంతం !
24/July/2026 15:04
Share:
అనకాపల్లి జిల్లా, (క్రైమ్ ఎనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ప్రధానోపాధ్యాయులు జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నగిరెడ్డి మహాలక్ష్మి, జడ్పీటీసీ సానాపతి సంధ్యారాము, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, రావి చలపతి, మాజీ వైస్ సర్పంచ్ కర్రీ సింహాచలం, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను, మొల్లేటి ప్రసాద్, దారా నూకరాజుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తల్లిదండ్రుల కోసం తాడు లాగుడు, ముగ్గుల పోటీలు, పలు వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించగా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులందరికీ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఆప్యాయ వాతావరణంలో భోజనం చేసి, పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, సంస్కృతి, తల్లిదండ్రుల భాగస్వామ్యానికి ప్రతీకగా నిర్వహించిన ఈ మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం గ్రామంలో విశేష ఆదరణ పొందింది.