ఎస్ ఈ జెడ్, ఫార్మా పరిశ్రమలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఈ నెల 30వ తేదీ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కాంట్రాక్టు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అభిజిత్ పరిశ్రమ వద్ద కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ ప్రభుత్వాలు 2017 నుండి ఇప్పటివరకు కనీస వేతనాల జీవో సవరించకపోవడం వలన కార్మికులు వేతనాలు కోల్పోతున్నారని ప్రతి ఐదు సంవత్సరాలకి వేతన సవరణ చేయాల్సి ఉన్న ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికుల కు వేతనాలు పెంచడం లేదు ఈ మధ్యకాలంలో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు 20 నుండి 60 శాతం వేతనాలు పెంచారు ప్రభుత్వ విధానాల వల్ల నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తక్కువ వేతనంతో పిల్లల చదువులు, ఆసుపత్రి , తిండి,బట్ట ,ఇంటిఅద్దెలు, రవాణా ,కరెంటు ,సరుకులు వినోదాలు ,పండుగలు కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 1992లో సుప్రీంకోర్టు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు కనీసం నెలకు 26,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది అందువల్ల కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు జీవోలను సవరించి వేతనాల పెంపు జీవో సవరించాలని, కార్మికులకు నష్టదాకమైన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని 30వ తేదీ న జరిగే కలెక్టరేట్ ధర్నాకు కాంటాక్ట్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబిజిత్ కాంట్రాక్ట్ కార్మికులు మహిళలు పాల్గొన్నారు.