న్యూఢిల్లీ: పార్లమెంట్ రుతుపవన సమావేశాల ప్రారంభం వేళ రాజధాని ఢిల్లీలో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన 'చలో సంసద్' మార్చ్ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్లు, కాలింగ్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాలా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు. ఈ మార్చ్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీకి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.దేశంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.మంత్రి రాజీనామాకు డిమాండ్: పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఈ చలో సంసద్ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనుమతి లేని ప్రదర్శనలు, ర్యాలీలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్న పోలీసులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.