ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు యలమంచిలిలో భారీ అవగాహన ర్యాలీ..

ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు యలమంచిలిలో భారీ అవగాహన ర్యాలీ..

18/July/2026 21:52    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్  :


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక 'స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా శనివారం యలమంచిలిలో స్వచ్ఛతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం చేపట్టే కార్యక్రమంలో, ఈ నెల థీమ్ అయిన *'బల్క్ వేస్ట్ జనరేటర్ ఎన్యుమరేషన్'*పై ప్రత్యేక దృష్టి సారించారు.స్పెషల్ ఆఫీసర్ అరుణ, మున్సిపల్ కమిషనర్ బి.జె.ఎస్.పి. రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి వెజిటబుల్ మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్, సచివాలయ, మెప్మా సిబ్బందితో కలిసి మార్కెట్‌లోని వ్యాపారులకు చెత్త నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నందున ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ, రోజుకు *100 కిలోలకుపైగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు లేదా సముదాయాలు 'బల్క్ వేస్ట్ జనరేటర్లు'*గా పరిగణించబడతాయని తెలిపారు. అలాంటి సంస్థలు తమ ఆవరణలోనే ఆన్‌సైట్ కంపోస్టింగ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.తదుపరి అధికారుల బృందం కొక్కిరపల్లి బాలికల హాస్టల్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బల్క్ వేస్ట్ జనరేటర్‌ను పరిశీలించింది. విద్యార్థులు, సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణలో నాలుగు రకాల చెత్త విభజనపై అవగాహన కల్పించి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కె. విజయ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, శానిటేషన్ సెక్రటరీలు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter