కాంట్రాక్టు లెక్చరల్ల రెన్యువల్ కు దరఖాస్తుల ఆహ్వానం

 కాంట్రాక్టు లెక్చరల్ల రెన్యువల్ కు దరఖాస్తుల ఆహ్వానం

15/July/2026 19:15    Share:   

అనకాపల్లి జిల్లాలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ లుగా    2025  - 2026 విద్యా సంవత్సరం వరకు  పనిచేసిన అధ్యాపకులు తమ కాంట్రాక్ట్ ను తిరిగి రెన్యువల్ పొందుటకు దరఖాస్తులు కోరుతున్నారు .దీనికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఐడెంటిఫైడ్ డిగ్రీ కళాశాల  అయిన ఎలమంచిలి శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా . పి చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం వరకు జిల్లాలోని ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు గా పని చేసిన సబ్బవరం డిగ్రీ కళాశాల హిస్టరీ , చోడవరం డిగ్రీ కళాశాల హిస్టరీ ,పొలిటికల్ సైన్స్,  వడ్డాది మాడుగుల డిగ్రీ కళాశాల హిస్టరీ, నక్కపల్లి డిగ్రీ కళాశాల బోటని, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీషు , కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్, నర్సీపట్నం డిగ్రీ కళాశాల మాథెమాటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ కాంట్రాక్టును 2026-2027 విద్యా సంవత్సరం  పునరుద్దించుకోవడానికి ఐడెంటిఫైడ్ డిగ్రీ కళాశాల అయిన ఎలమంచిలి డిగ్రీ కళాశాల కు తమ దరఖాస్తులను ఈ నెల 18/7/2026 వ తేదీ లోగా సమర్పించవలసిందిగా కోరారు.
Breaking News

Subscribe our Newsletter