మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్  అమలు చేయాలి...

మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్  అమలు చేయాలి...

11/July/2026 21:12    Share:   

ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ)ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి,మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్  అమలు చేయాలి,మహిళా హక్కుల కోసం పోరాడుతాం,ఏరియా సమితి సభ్యురాలు ఉప్పులూరి భవాని.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు: 

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణన, డి లిమిటేషన్ తో ముడి పెట్టకుండా తక్షణం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, సభ్యురాలు ఉప్పులూరి భవాని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు పెద్ద పోస్ట్ ఆఫీసు వద్ద రక్త వేలి ముద్రలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఉత్తరాలను పంపించారు.ఈ సందర్భంగా కొల్లూరి సుధారాణి మీడియాతో మాట్లాడుతూ డి లిమిటేషన్ ఆలస్యం అయితే మహిళా రిజర్వేషన్ కూడా ఆలస్యం అవుతుందని, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు, శాసనసభ్యులను కలిసి మద్దతు కోరుతున్నామని తెలిపారు. మహిళలకు మోడీ సర్కారు ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎటువంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్స్ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఏరియా సమితి సభ్యురాలు ఉప్పులూరి భవాని మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం వారి సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రిజర్వేషన్ అమలు ఆలస్యం చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా వివాదాస్పదమైన డి లిమిటేషన్ కు మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అమలను తన స్వార్థానికి ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు.షరతులు లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సమితి ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి,సభ్యులు ఉప్పులూరి లక్ష్మి, మావూరి విజయ, ఉప్పులూరి జ్యోతి, ఆలూరి పార్వతి,రాణి, ఉప్పులూరి ప్రభావతి, ఉప్పులూరి పరిశుద్ధం, ఉప్పులూరి రాజమణి, పంతం సుందరమ్మ, ఉప్పులూరి రాణి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter