ఘనంగా మాజీ శాసనసభ్యులు యూ వి.రమణమూర్తి రాజు 75వ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ శాసనసభ్యులు యూ వి.రమణమూర్తి రాజు 75వ జన్మదిన వేడుకలు

11/July/2026 21:05    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

యలమంచిలి  మాజీ శాసనసభ్యులు యూ.వి. రమణమూర్తి రాజు (కన్నబాబు) 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యలమంచిలి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కేక్, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, కన్నబాబు రాజు యలమంచిలి పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ, యలమంచిలి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రైల్వే గేటు సమస్యను గుర్తించి, కన్నబాబు రాజు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొద్ధపు ఎర్రయ్యదొర, మాజీ ఎంపీపీ బోదెపు గోవింద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సేనాపతి సంధ్య రాము, బీసీ సెల్ అధ్యక్షుడు యూటీఆర్ త్రినాథ్,  కౌన్సిలర్లు డాక్టర్ త్రినాథ్, కోటారు కొండబాబు, దాసరి కుమార్, మాజీ సర్పంచ్‌లు కొల్లి త్రినాథ్, మర్రి రాజు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉప్పులూరు కిరణ్ కుమార్, జడ్పీటీసీ పెంటకోట స్వామి, సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter