ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 17 మందికి దివ్యాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ
07/July/2026 21:37
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందిస్తున్న సేవలు నిరుపమానమని ఆయన కొనియాడారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 17 మందికి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాలను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అవసరార్థులకు సహాయం అందించడంతోపాటు దాతల సహకారంతో కూడా మరింత మందికి చేయూతనందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేళ్లు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో కూడా అందరికీ సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, కడియాల విజయలక్ష్మి, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.