*జడా శ్రావణ్ కుమార్ మరియు రావణ్ లపై అక్రమ కేసులు ఎత్తివేయ్యాలి...
03/July/2026 20:56
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు దళిత నాయకులు డిమాండ్ఈరోజు ఏలూరులో ప్రయివేటు ఫంక్షన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ చాగంటి సంజీవ్ ఐఆర్ఎస్ మాట్లాడుతు అందరికి సమన్యాయం జరగాలని దళిత క్రైస్తవులపై దాడులను కూటమి ప్రభుత్వం అరికట్టాలని కోరుతు రావణ్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు నేతల రమేష్ బాబు మాట్లాడుతు దళిత క్రైస్తవుల తరపున తమ గళం విప్పుతున్న వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఇది మంచి సాంప్రదాయం కాదని దళిత క్రైస్తవులను తక్కువ చేసి చూస్తే జరగబోయే పరిమాణాలకు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు మెండెం సంతోష్ కుమార్ మాట్లాడుతు మత స్వేచ్ఛ భావప్రకటనా స్వేచ్చ భారత రాజ్యాంగం కల్ఫించిన ప్రాదమిక హక్కులని వీటిని అడ్డుకుంటే ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు పల్లెం ప్రసాద్ మాట్లాడుతు రావణ్ జడా శ్రావణ కుమార్ తదితరులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు జక్కుల బెనర్జీ మాట్లాడుతు క్రైస్తవులు శాంతి సామరస్యంతో మెలుగుతారని వారి సహనాన్ని పరీక్షించవద్దని పేర్కొన్నారు ఈ సమావేశంలో పాము సామ్యేల్, కుర్మా రాజు, గేరా అబ్రహం,అలుగుల సాయిరాజు,బేతాళ నాగరాజు, గుదే రాంబాబు,పూలే పెరియార్ అంబేడ్కర్, పాము రవీంద్ర, కనికెళ్ళి మురళీ తదితరులు పాల్గొన్నారు