జనసేన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవుల వికేంద్రీకరణ..

జనసేన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవుల వికేంద్రీకరణ..

02/July/2026 20:39    Share:   

#జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ' కార్యక్రమంలో దరఖాస్తు అందజేసిన రెడ్డి అప్పలనాయుడు గారు..
#సామాన్య కార్యకర్తలను నాయకులుగా ఎదిగించే గొప్ప ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే..
#దేశంలో ఏ రాజకీయ నాయకుడూ తీసుకోని వినూత్న నిర్ణయం.
#గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపు.

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు గురువారం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని జనసేన జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా కొప్పుల వెలమ కళ్యాణ మండపం నందు నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం, కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా తన అప్లికేషన్‌ను ఏలూరు పార్లమెంట్ అబ్సర్వర్, రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ "జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీతి, నిజాయితీలతో పేద ప్రజలకు, సమాజానికి సేవ చేయాలనుకునే సామాన్య కార్యకర్తలను సైతం ఉన్నతమైన నాయకులుగా ఎదిగించాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి గొప్ప ఆశయం, ఆలోచన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ, మరే ఇతర రాజకీయ నాయకుడికీ రాలేదు. సామాన్య కార్యకర్తలను నాయకులుగా మార్చేందుకు, ఆసక్తి గలవారు గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ లేదా రాష్ట్ర కమిటీలలో తమకు నచ్చిన, అర్హత గల హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలని మన అధినేత పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు తన దరఖాస్తును సమర్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమకు నచ్చిన హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను" అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు మరియు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter