ఏటికొప్పాక ఇరిగేషన్ కాలువల పూడికతీతకు శ్రీకారం...

ఏటికొప్పాక ఇరిగేషన్ కాలువల పూడికతీతకు శ్రీకారం...

30/June/2026 14:53    Share:   

అనకాపల్లి జిల్లా, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో రైతులకు సాగునీటి సరఫరా సక్రమంగా అందేలా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువల పూడికతీత, అడ్డుగా పెరిగిన చెట్ల తొలగింపు పనులను క్రేన్ మిషన్ సహాయంతో ఘనంగా ప్రారంభించారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
ఈ పనులను నీటి సంఘం అధ్యక్షులు దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు రావి చలపతి, కాలువ డైరెక్టర్లు కర్రీ సింహాచలం, గొంతు మూర్తి రాజారావు, కోరుమిల్లి ప్రభ, అన్నం రాంబాబు సమక్షంలో ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, కొండయ్య నాయుడు, అన్నం స్వరాజ్ రావు, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, దేవరపు మోహన్ రావు, బీజేపీ నాయకుడు శెన్నాంశెట్టి శ్రీను తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు.ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పూడికతీత పనులు పూర్తయితే సాగునీటి సరఫరా మరింత మెరుగుపడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నాయకులు తెలిపారు. పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Breaking News

Subscribe our Newsletter