తాజా ఆవిష్కరణ:
దక్షిణాఫ్రికాలోని 'వండర్‌వర్క్' గుహల్లో కాలిన జంతువుల ఎముకలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ ఎముకలు సుమారు 17.9 లక్షల సంవత్సరాల క్రితం నాటివని పరిశోధనల్లో తేలింది.అంతకుముందు ఇదే గుహలో దొరికిన 10 లక్షల ఏళ్ల నాటి బూడిద, కాలిన ఎముకలే అత్యంత పురాతన ఆధారాలుగా ఉండేవి. నిప్పు నియంత్రణ వల్ల ఆహారం వండుకోవడం అలవాటైంది. ఇది మానవ మెదడు ఎదుగుదలకు, శారీరక మార్పులకు కారణమైంది.క్రూర జంతువుల నుండి రక్షణకు, చలి నుండి తట్టుకోవడానికి నిప్పు ఆదిమానవునికి ఎంతగానో ఉపయోగపడింది.ఈ తాజా అన్వేషణతో మానవ పరిణామక్రమ సిద్ధాంతాలను పరిశోధకులు ఇప్పుడు సరికొత్త కోణంలో సమీక్షిస్తున్నారు.
చారిత్రాత్మక పరిశోధన చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ తాజా పరిశోధనను ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'PLOS ONE' లో ప్రచురించారు. ఈ బృందంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పరిశోధకులు: