పిజిఆర్ఎస్ అర్జీలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

పిజిఆర్ఎస్ అర్జీలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

22/June/2026 20:02    Share:   

ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 307

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి  అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాలులో  సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు   జాయింట్ కలెక్టర్ యు.జె. అభిషేక్ గౌడ,  ఇంచార్జ్ డిఆర్ఓ ఎల్. దేవకీదేవి, ఏలూరు ఆర్డిఓ కె. లక్ష్మీప్రసన్న,  ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటిలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.  సోమవారం పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో 307 అర్జీలు అందాయన్నారు.  అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.  ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులతో  మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. 
కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన సిహెచ్. మార్తమ్మ తమ పొలములోనికి ఉన్న దారిని సరిహద్దు రైతు రైతు  ఆక్రమించుకుని దారిలేకుండా చేశారని, తమకు న్యాయం చేయాలనీ కోరారు. ఏలూరు కు చెందిన ఎం. లక్ష్మి తనకు అన్నదాతా సుఖీభవ పధకం మంజూరు చేయాలనీ కోరారు. చింతలపూడి మండలం పనుపెడ కు చెందిన పింగుల యేసేబు తన దరఖాస్తులో తన పొలంలో కొంతభాగాన్ని సరిహద్దు రైతు ఆక్రమించాడని తనకు న్యాయం చేయాలనీ కోరారు. లింగపాలెం మండలం యడవల్లికి చెందిన కూచిపూడి కుమారి తన దరఖాస్తులో  తన ఇంటిస్థలంను సరిహద్దుదారుడు ఆక్రమించాడని తనకు న్యాయం చేయాలనీ కోరారు.  టి.నర్సాపురం మండలం బంధముచెర్ల కు చెందిన అనుమోలు నరసింహారావు తన దరఖాస్తులో తన భూమిలోనికి వెళ్లే దారిని సరిహద్దు దారులు ఆక్రమించారని తనకు న్యాయం చేయాలనీ కోరారు. పెదవేగి మండలం రామసింగవరం నకు చెందిన కొలికిపము గంగమ్మ తన దరఖాస్తులో తనకు 6 సెంట్ల స్థలంలో చర్చి కలదని, ఆ స్థలం కొలతవేసి పట్టా మంజూరు చేయవలసిందిగా కోరారు.  ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన షేక్ శ్రావణి తనకు ట్రాన్సజెండర్ పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. సదరు దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.కార్యకమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వి. నాంచారయ్య, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter