రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ నూతన పాల సేకరణ కేంద్రం ప్రారంభం..!!

రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ నూతన పాల సేకరణ కేంద్రం ప్రారంభం..!!

03/May/2026 21:24    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ యలమంచిలి 
రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ నూతన పాల సేకరణ కేంద్రాన్ని హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాడి రైతులతో సమావేశమై హెరిటేజ్ డైరీ ద్వారా రైతులకు అందించే పలు సంక్షేమ పథకాలను వివరించారు.హెరిటేజ్ డైరీలో పాలు పోసే పాడి రైతులకు పాడి పశువుల కోసం కృత్రిమ గర్భధారణ సేవలు కేవలం రూ.50కే అందిస్తామని తెలిపారు. అలాగే ఆడ దూడ పుట్టే విధంగా ప్రత్యేక కృత్రిమ గర్భధారణ సేవను రూ.500కే అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.అదేవిధంగా, హెరిటేజ్ డైరీ పాడి రైతులకు సంవత్సరానికి రెండుసార్లు బోనస్ పంపిణీ చేయడంతో పాటు, రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.పాడి రైతుల సంక్షేమం కోసం సహజ మరణానికి రూ.50,000, ప్రమాద మరణానికి రూ.2 లక్షల బీమా సదుపాయం రైతు నామినీకి అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని ఇతర డైరీల కంటే హెరిటేజ్ డైరీ ఎక్కువ ధర చెల్లిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి. గోవిందు, ఎం. రాజు, డి. వరలక్ష్మి, డి. శ్రీనివాసు, అప్పలరాజు, రవణమ్మ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter