గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందేలా చూడాలి.రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ...

గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందేలా చూడాలి.రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ...

21/June/2026 08:39    Share:   

గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందేలా చూడాలి.
 
ఎస్టీలుపై దాడులను తీవ్రంగా పరిగణించాలి, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
 
రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ...
 
గిరిజన సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత.జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ...
 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు, సంక్షేమ పధకాలు  ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు.  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన ఏలూరు కలెక్టరేటు గోదావరి సమావేశమందిరంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పాల్గొని గిరిజన సమస్యలు, సంక్షేమ పధకాల అమలుపై, ఆయా శాఖల్లో రోస్టర్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు,  ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ, తదితర అంశాలుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గిరిజనులు నుంచి ఆయా సమస్యలు పరిష్కారంకోసం వినతులను ఆయన స్వీకరించారు.  
సమావేశంలో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎస్టీ కమీషన్ సభ్యులు కాకి లక్షీ, గొర్లె సునీత, జిల్లా జాయింటు కలెక్టరు డా.ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు. 
ఈ సందర్బంగా రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించి గిరిజనులనుంచి వినతులు స్వీకరించినట్లు పేర్కొంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు.  జిల్లాలోని 18 ఎస్టీ విద్యాసంస్ధల్లో రూ. 1.47 కోట్లతో 196 టాయిలెట్స్ ను మంజూరు చేసిన జిల్లా కలెక్టరు వారిని ఆయన అభినందించారు.  ఈ పనులన్నింటిని నెలలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గిరిజనులకు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు తీరును ఆయన సమీక్షిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.  ఇదే స్పూర్తితో మిగిలిన సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. 
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గిరిజన సమస్యలు పరిష్కారంకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో గిరిజన సమస్యలు పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. పి.జి.ఆర్.ఎస్. లో వినతులను సత్వరం పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యంలేని గిరిజన ప్రాంతంలోని రెండు మండలాల్లో మూడు గ్రామాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.  గిరిజన ప్రాంతంలో విద్యార్హతలు తక్కువగా ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉపాధి కల్పించేందుకు తగు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సర్వేమేరకు పశుపెంపకానికి రుణాలు కోరిన గిరిజనులకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా ఒక కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉపాధి కల్పించేందకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నామన్నారు.  పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వాటిని విచారణ చేసి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.  గిరిజన ప్రాంతంలోని 5 మండలాల్లో ఉపాధిహామీ కింద రూ. 30 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కమీషన్  జిల్లా పర్యటన సందర్బంగా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
సమావేశంలో ఎస్టీ కమీషన్ డిప్యూటీ డైరెక్టర్ కట్టా సాంబయ్య , ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, డిఎఫ్ఓ పి.వి.సంధీప్ రెడ్డి, ఇన్ చార్జి డిఆర్ఓ ఎల్. దేవకీదేవి, జెడ్పి సిఇఓ పి.జగదాంబ, డిపివో జి జి.మల్లిఖార్జునరావు, ఆర్ డిఓ కె.లక్ష్మీప్రసన్న, జిల్లా వ్యవసాయశాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ కె.ఎం. అంబేద్కర్, వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter