ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు ,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి..!
31/May/2026 06:44
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు - రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేసమయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మరింత స్పష్టమైన అవగాహనా వైఖరితో పటిష్టవంతమైన అడుగులు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించి, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఇదేక్రమంలో ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి కూడా సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...