యలమంచిలి, : పట్నంలోని సర్కిల్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బందికి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వైద్య పరీక్షల్లో బీపీ, సుగర్, బ్లడ్ టెస్ట్లో నిర్వహించారు. అలాగే వైద్య నిపుణులు ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అవసరం అయిన వారికి మందులను ఉచితంగా అందజేసినట్లు ఎస్ఐ సావిత్రి, రూరల్ ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.