యలమంచిలి శ్రీశ్రీశ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఏప్రిల్ 24 న
01/March/2026 19:52
Share:
క్రైమ్ అనాలసిస్ (టివియస్ ప్రకాష్) యలమంచిలి : యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కట్టుపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణం గ్రామ ప్రజలు మరియు వివిధ దాతల సహకారంతో వేగవంతంగా కొనసాగుతోంది. భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు ప్రతీకగా నిర్మితమవుతున్న ఈ ఆలయం ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త కర్రి శివశంకర గణేశ్వరరావును కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.50,116లను ఆలయ నిర్మాణ నిమిత్తం విరాళంగా అందజేశారు. ఆయన సేవాభావాన్ని అభినందిస్తూ కమిటీ సభ్యులు పండూరు గోవిందరావు, హరినాథ్, నాగేశ్వరరావు, ఎరుకు నాయుడు, పి.పి. నాయుడు, టివియస్ ప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.