రగ్బీ పోటీలో మెరిసిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కుసుమ

రగ్బీ పోటీలో మెరిసిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కుసుమ

26/February/2026 20:51    Share:   

యలమంచిలి : పట్నంలోని శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న బొడ్డు కుసుమ  ఇండియాలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో అస్మిత రగ్బీ లీగ్ వారు నిర్వహించిన అండర్ 18 రగ్బీ పోటీలలో చక్కని ప్రదర్శన కనబరిచారు. మొదట జిల్లా స్థాయిలో నిర్వహించిన రగ్బీ పోటీలలో మంచి ప్రదర్శన కనబరిచిన కుసుమ గత డిసెంబర్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్కడ కూడా చక్కని ప్రతిభ కనబరచడంతో చెన్నైలో జరిగిన సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21, 22 తేదీలలో చెన్నైలో జరిగిన ఈ సౌత్ జోన్ పోటీలకు కుమారి కుసుమ ఆంధ్రప్రదేశ్ టీమ్ లో పాల్గొనడమే కాకుండా కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుమారి కుసుమను కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి చిరంజీవి, పి.డి. సతీశ్ కుమార్ లు అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter