గ్రామ సింహాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. పశుసంవర్ధక శాఖ అధికారుల చర్యలు.

గ్రామ సింహాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. పశుసంవర్ధక శాఖ అధికారుల చర్యలు.

18/February/2026 12:50    Share:   

అనకాపల్లి ఫిబ్రవరి 18 
సీనియర్ జర్నలిస్ట్ గంట గోవింద్
గ్రామ సింహాలు విజృంభిస్తున్నాయి. అనకాపల్లిలో అనేకమంది కుక్కకాటు బాధితులుగా మారుతున్నారు. మనుషుల్ని కాకుండా పశువుల్ని కూడా ఇవి విడిచిపెట్టడం లేదు. వాటిపై కూడా దాడి చేసి కరచి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఈ సమస్య ఒక అనకాపల్లి లోనే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది. దాంతో ప్రభుత్వం గ్రామ సింహాల నియంత్రణకు చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఇటీవల సమీక్ష నిర్వహించి పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కుక్కల అధిక సంతానోత్పత్తిని నియంత్రించడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గంగా కనిపిస్తుంది. మనుషులు మాదిరిగా వీటికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు పశుసంవర్ధక శాఖ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి సౌజన్యను సీనియర్ జర్నలిస్ట్ గంట గోవింద్ కలిసి సమస్యను ప్రస్తావించినప్పుడు ప్రభుత్వ చర్యలపై ఆమె ఇలా మాట్లాడారు.
Breaking News

Subscribe our Newsletter