ప్రపంచ చలనచిత్ర దినోత్సవం సందర్భముగా గానగంధర్వ గళమాంత్రికుడు శ్రీ ఎస్.పి.బాలు మధురగీతాల పుస్తకంను మాజీ ఎమ్.పి.డాక్టర్ శ్రీమతి బి.వి.సత్యవతి గారి చేతులమీదుగా విడుదల చేసారు.
స్థానిక మాజీ ఎమ్.పి.గారి కార్యాలయములో ప్రపంచ చలనచిత్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని అనకాపల్లి వాస్తవ్యులు విశ్రాంత డ్రాయింగ్ ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి అవిరళ కృషి తో శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన 48 వేల పాటలలో ఆణిముత్యాల్లాంటి 567 తెలుగు సినీ మధురగీతా లను ఎంపిక చేసిన ఎంతో వ్యయ ప్రయాసలతో ముద్రణ చేయించిన " గాన గంధర్వ గళమాoత్రికుడు శ్రీ ఎస్.పి.బాలుగారి మధురగీతాల పుస్తకాన్ని మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శ్రీమతి బి.వి.సత్యవతి గారి చేతుల మీదుగా విడుదల చేసారు.

ఈ సందర్భముగా డాక్టర్ శ్రీమతి బి.వి.సత్యవతి గారు మాట్లాడుతూ అనకాపల్లి వాసి, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు ప్రముఖ తెలుగు సినీ గాయకు లు, పద్మవిభూషణ్, శ్రీపతి పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారి అభిమాని గా, వారు తెలుగు సినీ రంగానికి అందించిన విశేష సేవలకు గుర్తుగా శ్రీ సూర్యనారాయణ శాస్త్రి మాష్టారు గారు ఆరు నెలల పాటు బాలు గారు పాడిన 48 వేల పాటలలో ఆణి ముత్యాల్లాంటి అశేష ప్రజాదరణ పొందిన 567 పాటలతో గాన గంధర్వ బాలు గారి మధురగీతాల పుస్తకాన్ని ఎంతో వ్యయ ప్రయాసలతో ముద్రణ గావించడం ఎంతో గొప్ప విషయమని ఇంతటి మంచి పుస్తకము ఎంతో మంది గాయనీ గాయకులకు ఎంతగానో ఉపయోగపడు తుందని ఈ పుస్తకాన్ని బాలు గారి అభిమానులు, గాయనీ గాయకులు ఆదరించి ఉపయోగించుకోవాలని అన్నారు. పుస్తక పరిచయ కర్త శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి మాష్టారు గారు ఈ సందర్భం గా మాజీ ఎమ్.పి.డాక్టర్ శ్రీమతి బి.వి.సత్యవతి గారిని శ్శాలువా, పూల బొకేలను బాలుగారి మధురగీతాల పుస్తకాన్ని అందజేసి ఘనం గా సత్కరించారు.సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్, అధ్యక్షులు
ఘంటసాల గాయకుడు బల్లానాగభూషణము మాట్లా డుతూ ప్రపంచ చలనచిత్ర దినోత్సవ వేడుకల్లో భాగము గా పద్మవిభూషణ్, గాన గంధర్వ శ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యము గారి 567 మధుర గీతాల పుస్తకమును కళ లకు నిలయమైన అనకాపల్లి పట్టణంలో గౌరవ మాజీ ఎమ్.పి. డాక్టర్ శ్రీమతి బి.వి.సత్యవతి గారు విడుదల చేయడం ఎంతో అభినంద నీయమని ఇంతటి మంచి పుస్తకాన్ని సినీ అభిమానులు ఆదరించాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమములో పుస్తక పరిచయ కర్త శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి మాష్టారు, సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్, అధ్యక్షులు, ఘంటసాల గాయకుడు బల్లానాగభూషణము, సిద్దార్ధ అసోసియేషన్, సహాయ కార్యదర్శి రొబ్బి మల్లేశ్వరరా వు, బొడ్డు సోమరాజు, అయ్యగారు వెంకట రమణ మూర్తి, బెన్నాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.