జిల్లాస్థాయి ఆర్ట్ మరియు కల్చరల్ కాంపిటీషన్స్ 2025–26
06/February/2026 09:49
Share:
అనకాపల్లి జిల్లాస్థాయి ఆర్ట్ మరియు కల్చరల్ కాంపిటీషన్స్ 2025–26 సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద
అనకాపల్లి జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికల కోసం జిల్లాస్థాయి ఆర్ట్ మరియు కల్చరల్ కాంపిటీషన్స్ 2025–26 కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ పోటీలు అనకాపల్లి గుండాల జంక్షన్‌లోని ఎస్.ఆర్. శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్‌లో 06.02.2026 తేదీన ఉదయం 9.00 గంటల నుండి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అదనపు పథక సమన్వయకర్త శ్రీ గిడ్డి అప్పారావు నాయుడు గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్, క్రాఫ్ట్, సింగింగ్, డ్రామా తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని జిల్లా సహిత విద్య సమన్వయకర్త శ్రీ బి. రామకృష్ణ గారు వివరించారు. ప్రతి విభాగంలో వయోపరిమితి ఆధారంగా సీనియర్ మరియు జూనియర్ కేటగిరి లలో పోటీలు నిర్వహించబడతాయి.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు భవిత కేంద్రాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయబడతాయి. జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వారు తెలియజేశారు.