టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు గారితో ప్రగడ నాగేశ్వరరావు భేటీ..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు గారితో ప్రగడ నాగేశ్వరరావు భేటీ..

14/November/2026 21:41    Share:   

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *శ్రీ పల్లా శ్రీనివాస రావు గారిని, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు ఈరోజు (శనివారం) మర్యాదపూర్వకంగా కలిశారు. గాజువాక  క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు.​ఈ సందర్భంగా, నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను ప్రగడ నాగేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో అనుసరించాల్సిన కార్యాచరణపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.​రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు గారు ఈ విషయాలను సావధానంగా విని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం.ఈ ఈ మీటింగ్ లో ప్రగడ నాగేశ్వరరావు గారి తో పాటుగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఎక్స్ స్టేట్ సెక్రటరీ దూల రంగనాయకులు గారు, సీనియర్ నాయకులు కాండ్రేగుల వెంకటరమణ గారు పాల్గొనడం జరిగింది.
Breaking News

Subscribe our Newsletter