బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం..

10/October/2026 20:42    Share:   

బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది: మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు

రాజాం, అక్టోబర్ 10:

బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి తగ్గకుండా ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రాజాంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగిందని ఆరోపించారు. బీసీలకు దక్కాల్సిన 34 శాతం రిజర్వేషన్ల అమలును అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారని విమర్శించారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తోందని, దివంగత ఎన్టీ రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ నాయకులకు రాజకీయంగా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ అందించే అకాడమీల ఏర్పాటులోనూ టీడీపీ కీలక పాత్ర పోషించిందని వివరించారు.
1987లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం, మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ సారా విక్రయాల కారణంగా పేదల ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంపొందించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కిమిడి కళావెంకటరావు..
Breaking News

Subscribe our Newsletter