ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, హోమాలు
చీపురుపల్లి, అక్టోబర్ 10:
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, హోమం ప్రారంభమవుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కుంకుమార్చన, హోమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ పవిత్ర నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, హోమాల్లో భాగస్వాములై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.గమనిక: ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కుంకుమార్చన, హోమం ప్రారంభమవుతాయి. పూజల్లో పాల్గొనదలచిన భక్తులు అరగంట ముందుగా, అంటే ఉదయం 8:30 గంటలకే దేవాలయానికి చేరుకోవాలని సూచించారు.
క్రైమ్ ఎనాలసిస్ రిపోర్టర్
చీపురుపల్లి ఎస్.ఏ.ఎన్. రాజు