ఎన్నికల నిర్వహణకు.యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి!

ఎన్నికల నిర్వహణకు.యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి!

09/October/2026 20:07    Share:   

నోటిఫికేషన్‌ కోసం ఆశావహులు ఎదురుచూపులు.. ఎన్నికల నిర్వహణకు అధికారుల ముందస్తు ఏర్పాట్లు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అధికారులు తదుపరి ఏర్పాట్లపై దృష్టి సారించారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామగ్రి భద్రపరిచే కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సన్నాహాలను అధికారులు చేపడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter