సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలి
నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం
అనకాపల్లి, అక్టోబర్ 6:
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నీటి వనరులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో వేదోక్త పద్ధతిలో వరుణ యాగాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, వరుణ జపం, వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌరిమాన్ పటేల్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మల్లా సురేంద్ర, కోట్ని బాలాజీ, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈఓ యాళ్ల శ్రీధర్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆలయ ధర్మకర్తలు, అధికారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస రావు అప్పికొండ