రష్యాలో కలకలం:

రష్యాలో కలకలం: 'మిస్టరీ' వ్యాధితో ల్యాబ్ ఉద్యోగి మృతి, 200 మందికి క్వారంటైన్

05/October/2026 13:30    Share:   

మాస్కో: రష్యాలో అనుమానిత ప్లేగ్ కేసు తీవ్ర కలకలం రేపింది. సైబీరియాలోని యాంటీ-ప్లేగ్ ప్రయోగశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి మిస్టరీ వ్యాధితో మరణించారు. ఆమెతో సంబంధంలోకి వచ్చిన దాదాపు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

ది మాస్కో టైమ్స్ కథనం ప్రకారం, మరణించిన యువతిని దారియా షిపిలోవా (28) గా గుర్తించారు. ఆమె ఇర్కుట్స్క్ ప్రాంతంలోని యాంటీ-ప్లేగ్ పరిశోధనా సంస్థలో పనిచేస్తున్నారు.

యాక్సియోస్ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 25న న్యుమోనిక్ ప్లేగ్ వ్యాధికారకం ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను ఆమె అనుకోకుండా పగలగొట్టారు. ల్యూడి బైకాలా వార్తా సంస్థ ప్రకారం, నమూనాలు సేకరిస్తుండగా ప్రత్యక్ష బ్యాక్టీరియా ఉన్న ట్యూబ్ పగిలిందని ఆమె స్వయంగా వైద్య సిబ్బందికి చెప్పారు.

మంగోలియాతో రష్యా తూర్పు సరిహద్దుకు సమీపంలో ఇతర సిబ్బందితో కలిసి యాత్రలో ఉన్న సమయంలోనే ఆమెకు మొదట అస్వస్థత మొదలైంది. తీవ్రమైన న్యుమోనియాతో సెప్టెంబర్ 29న ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్టోబర్ 1 నుంచి 2 మధ్య రాత్రి ఆమె మరణించారు.

ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక వైద్య సౌకర్యాలను క్వారంటైన్‌లో ఉంచారు. ఆమెతో కాంటాక్ట్‌లోకి వచ్చిన దాదాపు 200 మందిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు యాక్సియోస్ తెలిపింది.

Breaking News

Subscribe our Newsletter