సుదీర్ఘ కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి (NBW) అరెస్ట్
02/October/2026 19:30
Share:
అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 2:
అనకాపల్లి టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఎదుర్కొంటూ తప్పించుకు తిరుగుతున్న పాత కేసు ముద్దాయిని అరెస్ట్ చేశారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2011లో క్రైమ్ నం. 281/2011, U/s 306, 498-A IPC మరియు సెక్షన్ 3 & 4 DP Act కింద ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓం ప్రకాశ్ యాదవ్ @ ప్రకాష్ యాదవ్ (40) పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం సదరు నిందితుడు న్యాయస్థానం విధించిన వాయిదాలకు హాజరుకాకుండా గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో గౌరవనీయులైన 10వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం (అనకాపల్లి) నిందితుడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.కోర్టు ఆదేశాల మేరకు అనకాపల్లి టౌన్ పోలీస్ కానిస్టేబుల్స్ టి.ఎస్.నాయుడు, జగ్గారావు గాలించి నిందితుడు ఓం ప్రకాశ్ యాదవ్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని ఈరోజు గౌరవ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరిగింది. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.