జిల్లా కార్యవర్గ సభ్యులుగా పలువురు పాత్రికేయుల ప్రమాణ స్వీకారం
చీపురుపల్లి, సెప్టెంబర్ 30:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) విజయనగరం జిల్లా కార్యవర్గంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు పాత్రికేయులకు ప్రాధాన్యత లభించింది. జిల్లా కార్యవర్గంలో వివిధ హోదాల్లో స్థానం కల్పిస్తూ నూతన కార్యవర్గంలోకి ఎంపిక చేశారు.ఈ సందర్భంగా బుధవారం విజయనగరంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చీపురుపల్లి నుంచి జిల్లా కార్యవర్గంలో స్థానం సంపాదించిన పాత్రికేయులు టి. వెంకటరమణ, కె.వి.వి. ప్రసాద్, ఎస్. వెంకటేష్ (మధు), ఎలక్ట్రానిక్ మీడియా నుంచి లాబాను శ్రీను, మల్లిపూడి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. నూతన జిల్లా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏపీయూడబ్ల్యూజే సంఘం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాత్రికేయుల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఎన్నికైన సభ్యులకు వివరించారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని సూచించారు.జిల్లా కార్యవర్గంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు పాత్రికేయులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల చీపురుపల్లి పాత్రికేయులు జిల్లా నాయకులకు అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు