ప్రజలకు విస్తృతంగా వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీచీపురుపల్లి, సెప్టెంబర్ 29:
చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులు, స్త్రీల ఆరోగ్యం, జనరల్ మెడిసిన్, మాతా–శిశు ఆరోగ్యం, ఎముకలకు సంబంధించిన సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు మందులను అందజేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్ ఏ ఎన్ రాజు