రాజాం పట్టణంలో నవచండీ సహిత రాజశ్యామల యాగం అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా జరుగుతోంది. కిమిడి రామ్ మల్లిక్ నాయుడు దంపతులు ఈ ఆధ్యాత్మిక క్రతువును ఘనంగా నిర్వహిస్తున్నారు.వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోకక్షేమం, ప్రజలందరి సుఖశాంతులు, సర్వజన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ మహాయాగాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు దంపతులు మాట్లాడుతూ.. అమ్మవారి దివ్య కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలనే సంకల్పంతోనే ఈ యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్ ఏ ఎన్ అప్పలరాజు