- 34% రిజర్వేషన్లు పెంపు బీసీలకు వరం, పునరుద్ధరణ చారిత్రాత్మకం..
- సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట..
- కూటమి ప్రభుత్వం మంచి లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తుంది..
- మేయర్లు మున్సిపాలిటీ చైర్మన్ లను ప్రజలు ఎన్నుకునే విధానం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఆగష్టు 19:-
బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయం సామాజిక న్యాయ సాధనలో చారిత్రాత్మక ముందడుగు అని బీసీ నేత, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోటాను తిరిగి 34% పెంచుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన వ్యక్తం చేశారు. క్యాబినెట్ నిర్ణయానికి ఆమోదం ప్రకటిస్తూ ఆయన ప్రకటన చేయడం బీసీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34% పట్టణ ప్రాంతాల్లో 33.01% మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరిగేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు.
బీసీల సంక్షేమం, అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గానికి రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 34% రాజకీయ నిర్ణయం కేవలం ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా సామాజిక న్యాయం రాజకీయ సాధికారత దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రాజకీయ ప్రాధాన్యం 34% నుండి 24% తగ్గిందని, దీనివల్ల బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. బీసిల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంటే, గత ప్రభుత్వం రిజర్వేషన్లను తగ్గించిందని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని కార్యాచరణ లోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. మాట ఇచ్చినా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. మేయర్లను, మున్సిపాలిటీ చైర్మన్ లను ప్రజలు ఎన్నుకునే విధానం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి. మేయర్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ లను సైతం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నేరుగా ఎన్నుకోనున్న ఓటర్లు. ఇది చాలా గర్వించదగ్గ విషయం, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకులకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు, బిజెపి అధ్యక్షులు మాధవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈరోజు మంచి పరిపాలనకు నాంది పలికింది. ఈ నిర్ణయం పై ప్రజలు హర్షిస్తున్నారు. దీనిని అందరూ స్వాగతిస్తున్నారు. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకిపండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, రెడ్డి గౌరీ శంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, కూనిశెట్టి మురళి కృష్ణ, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, వాసా సాయి, జగపతి మనోహరం స్వామి, కొండల ప్రసాద్, వేముల బాలు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు..