ఏటికొప్పాక, ఆగస్టు 19
(క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
- అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత పశువైద్యాధికారిని నియమించాలి
- ఎలమంచిలి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలి
- సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో పశువైద్యశాల ఉన్నా రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎస్.ఓ., ఒక అటెండర్‌తోనే పశువైద్యశాల నడుస్తుండగా, ఎలమంచిలి నుంచి వారంలో రెండు రోజులు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో పశువులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత పశువైద్యాధికారిని నియమించాలని, ఎలమంచిలి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పశుపోషకులు కోరుతున్నారు.