మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు..

మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు..

11/August/2026 06:56    Share:   

యలమంచిలి:
స్థానిక శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సావిత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు 'అభయ' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థులకు మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. సోషల్ మీడియా పరిచయాలు, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా తమ రక్షణను కల్పించుకోవాలనే విషయాలపై విద్యార్థులకు వివరణాత్మకంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, డీన్ దత్తు, ఇంచార్జిలు లోకేశ్వరరావు, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter