క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న  దేశవ్యాప్త జైల్ బరో..

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న  దేశవ్యాప్త జైల్ బరో..

09/August/2026 08:01    Share:   

(క్రైమ్ అనాలసిస్ ప్రతినిధి కన్నేపల్లి నాగ శ్రీను వాస శర్మ)
యలమంచిలి,
అచ్చుతపురం సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు పిలుపుమేరకు ఆగస్టు 10 జైలు బరో జయప్రదం చేయాలని కరపత్రాలు సిఐటియు విడుదల చేసారు,కార్మికులు, రైతాంగం సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కార్మికులకు కనీస వేతనం 31వేలు ఇవ్వాలని,కార్మిక హక్కులను హరించేస్తున్న లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై అదనంగా మరో 50% కలిపి మద్దతు ధరలు కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చి రాంజీ పథకంగా మార్చి నోటికాడ కూడిన తీసేసిందని ,స్కీం వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని తదితర డిమాండ్లతో జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని కోరారు.కరపత్రాలు విడుదల చేసిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి. అప్పారావు, మత్స్యకారము సంఘం జిల్లా నాయకులు చేపల. తాతీయులు, సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు.సోము నాయుడు, శ్రీను, సన్యాసిరావు  తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter