శాకంబరీ అలంకరణలో భగీరధీ అమ్మవారు దర్శనం..

శాకంబరీ అలంకరణలో భగీరధీ అమ్మవారు దర్శనం..

07/August/2026 18:26    Share:   

 
యలమంచిలి/హరిపాలెం,అందలాపల్లి హరిగిరి కొండపై వెలసిన శ్రీ శ్రీ భగీరధీ అమ్మవారు భక్తులకు శాకంబరీ అలంకరణలో దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి శాకంబరీ దేవి స్వరూపాన్ని దర్శించుకుని మురిసిపోయారు. భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరరావు, పూజారి సత్యనారాయణ ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవ ఫౌండేషన్ యలమంచిలి సబ్ డివిజన్ కన్వీనర్ బి.వి.రమణ, గాంధీ, వెంకట అప్పారావు, భీమిశెట్టి రమేష్, బుద్ధ చిన్న, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, అప్పారావు మునగువారు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter