యలమంచిలి/దస్తావేజు లేఖర్లను ఆదుకోవాలని జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి గనిశెట్టి. ఏసుదాస్ డిమాండ్. శుక్రవారం యలమంచిలిలో దస్తా రైటర్స్ 12వ రోజు ధర్నాలో భాగంగా ఏసుదాసు సంఘీభావం తెలియజేశారు. ఏసుదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 396 జీవో తీసుకువచ్చి కార్పొరేట్ వ్యక్తులకు దస్తావేజులు రాయటానికి అప్పచెప్పే ప్రయత్నం దురదృష్టకరమని ఈ వృత్తిపై వేలాది మంది కుటుంబాలు బతుకుతున్నాయని వారిని పొట్ట కొట్టడం దురదృష్టకరమని కార్పొరేట్ వ్యక్తులు స్థానిక ప్రజల భూములు వివరాలు సరైన అవగాహన లేక ప్రజల ఇబ్బంది పడే అవకాశం ఉంది కావున పాత పద్ధతిని కొనసాగించాలని వారి పోరాటాలకి జిల్లా (ఏఐటీయూసీ) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఏసుదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు చలమచెట్టి నాగ శేషు, శానాపతి రాము, పంచదారల. సురేష్ అర్లి. ఉమామహేశ్వరరావు పిల్లా. నాగేశ్వరరావు తదితరులు పెద్ద ఎత్తున దస్తాలేఖర్లు పాల్గొన్నారు.