ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. భోగాపురంలో ఎమ్మెల్యే విజయ్‌కుమార్ పరిశీలన
31/July/2026 16:46
Share:
(క్రైమ్ ఏనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రేపు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పరిశీలించారు. ఎలమంచిలికి సంబంధించి ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలను రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేస్తూ పార్కింగ్, భోజన వసతి తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.